కోనసీమ: రావులపాలెం మండలం రావులపాలెంలో వైసీపీ క్యాంపు కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారావారి సారా ఏరులై పారుతుందని, ఆ కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోతున్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళల మాంగల్యాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని ఆరోపించారు.