AP: నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ప్రధాని మోదీ దర్శించుకున్నారు. మల్లన్నకు పంచామృతాలతో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ తన ట్విట్టర్ వేదిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.