MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని నోధ ప్రైవేట్ హాస్పిటల్లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్లో ఉన్న రిసెప్షన్ కౌంటర్ తాళం పగలగొట్టి మొబైల్ ఫోన్, రూ. 45,000 నగదు గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. చోరికి పాల్పడిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయినట్లు తెలిపారు. దీంతో హాస్పిటల్ యజమాన్యం తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.