CTR: రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సోమల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు హెచ్ఎం హేమ సుధాకర్, PD కరుణానిధి గురువారం తెలిపారు. ఈ మేరకు ఈ నెల 15న సీటీయంలో స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో జరిగిన అండర్ 19 హ్యాండ్ బాల్ పోటీలలో భారత్ సాయి ప్రతిభ చూపడంతో ఎంపికైనట్టు ఆయన వెల్లడించారు. త్వరలోనే ఒంగోలులో జరిగే రాష్ట్ర పోటీలకు హాజరుకానున్నాడు.