Hyd: గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. ఈ సందర్బంగా వారు ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.