CTR: చిత్తూరు నగరంలోని వీరభద్ర కాలనీలో ఇటీవల వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలను గురువారం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కలెక్టర్ సమిత్ కుమార్ పరిశీలించారు. ఈ మేరకు సుమారు 500 కుటుంబాలకు ఎమ్మెల్యే సొంత నిధులతో నిత్యావసర సరుకులు, దుప్పట్లను వారికి పంపిణీ చేశారు. దీంతో బాధితులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.