NGKL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తెలకపల్లి మండల కేంద్రంలోని గౌరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ హౌసింగ్ స్కీం కింద జరుగుతున్న ఇండ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు.