WNP: జిల్లాలో బాల కార్మికులు లేకుండా, పిల్లలపై వేధింపులు జరగకుండా చూడాలని జిల్లా వెల్ఫేర్ అధికారి సుధారాణి ఓ ప్రకటనలో తెలిపారు. వనపర్తి జిల్లా వెల్ఫేర్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పిల్లలు ఇంటి పనులు, వ్యవసాయ పనులు, ఎలాంటి పనులకు వెళ్లకుండా చూడాలని అధికారులను కోరారు. బాల్య వివాహాల వల్ల పిల్లలకు జరిగే అనర్థాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.