TG: జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీపై హైకోర్టులో విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్‌తో సంబంధం లేని వారు ఓటరు జాబితాలో చేరారని మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ తరపున న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. దీనిపై ఈసీ విచారణకు ఆదేశించిందని.. ఈ సమయంలో ఈసీకి ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.