WGL: జిల్లా NIT ప్రాంగణంలో కుక్కల బెడద తీవ్రమైంది. B.Tech మొదటి సంవత్సరం విద్యార్థినిని మూడు కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. హాస్టల్ నుంచి పరీక్ష రాయడానికి నడుస్తూ వెళ్తుండగా కుక్కలు వెంబడించాయి. భయభ్రాంతులతో పరుగెత్తినా, వెంబడించి తీవ్రంగా గాయపరచాయి. గాయపడ్డ విద్యార్థిని చికిత్స నిమిత్తం MGM ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.