మన్యం: వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ద కనబరచాలని జాయింట్ కలెక్టర్ ITDA PO సి.యశ్వంత్ కుమార్ రెడ్ది సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో వసతి గృహ విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై జేసీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పిల్లలు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై వైద్యాధికారులకు సూచనలు చేశారు.