SRCL: గర్భిణులు అధిక పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సీడీపీవో ఉమారాణి సూచించారు. పోషణ మాసం సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలు, పండ్లు,చిరుదాన్యాలు ఎక్కువగా తీసు కోవాలని, ఆయిల్, షుగర్ వాడకాలను తగ్గించాలని పేర్కొన్నారు.