SRCL: వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కేబుల్ నెట్వర్క్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో రెండు నుంచి మూడు లక్షల విలువైన కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మేనేజింగ్ డైరెక్టర్ కొలిపాక నరసయ్య సేవలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.