SRPT: CPR చేయడం వలన అత్యవసర సమయాలలో ప్రాణాలను కాపాడవచ్చుని త్రిపురవరం పీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీప్రసన్న తెలిపారు. నడిగూడెం మండల కేంద్రంలోని ZPHS పాఠశాలలో బుధవారం సాయంత్రం సీపీర్పై అవగాహన కల్పించారు. ఎవరైనా అకస్మాత్తుగా అపస్మారక స్థితిలో ఉన్నట్లయితే, గుండెపోటు లాంటివి వచ్చినట్లయితే వెంటనే CPR చేయడం వలన ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు.