BPT: మద్యం నాణ్యత తనిఖీకి ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష’ అనే మొబైల్ యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలని అద్దంకి ఎక్సైజ్ ఇన్ఛార్జి సీఐ హర్షవర్ధన్ రెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎక్సైజ్ శాఖ రూపొందించిన ఈ యాప్ ద్వారా మద్యం సీసాపై ఉన్న హీల్ వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మద్యం ఏ డిపో నుంచి సరఫరా అయ్యింది. ఏ షాపులో కొనుగోలు చేస్తున్నారు వంటి వివరాలు వస్తాయన్నారు.