SRPT: భువనగిరిలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో హుజూర్ నగర్‌కు చెందిన విద్యార్థి దేవి శెతేటి హర్ష వర్ధన్ ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం స్థానిక హుజూర్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న హర్ష వర్ధన్ విజయాన్ని ప్రిన్సిపల్ శ్రీనివాస్, విద్యార్థులు అభినందించారు.