KMM: కార్తిక మాసం సందర్భంగా ఖమ్మం డిపో నుంచి వివిధ పుణ్యక్షేత్రాలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్ సర్వీసుల పోస్టర్లను ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సరీరామ్ బుధవారం ఆవిష్కరించారు. కొత్త బస్టాండ్లోని ఆర్ఎం కార్యాలయంలో ఆయన ఈకార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం, డిపో మేనేజర్ పలువురు పాల్గొన్నారు.