VZM: సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రాంతీయ రవాణా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ వాహన ర్యాలీని గురువారం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. జీఎస్టీ శ్లాబులను రెండుకు తగ్గించడం వలన సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట ఇచ్చిందన్నారు. దీంతో ప్రజలకు సుమారు రూ.8 వేల కోట్ల పన్ను ఆదా అవుతుందని తెలిపారు.