NTR: విజయవాడ పున్నమిఘాట్లో ప్రారంభమైన గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్లో ప్రతిరోజు లక్కీ డ్రా నిర్వహిస్తామని కలెక్టర్ లక్ష్మిశా తెలిపారు. VMC నిర్వహిస్తున్న షాపింగ్ ఫెస్టివల్లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఉత్పత్తుల వంటి స్టాల్స్ ఉన్నాయని, ఫెస్టివల్లో వినోదంతోపాటు ప్రత్యేక ఆఫర్లు జీఎస్టీ సేవింగ్స్‌తో షాపింగ్ చేసుకోవచ్చన్నారు. ప్రతి కొనుగోలుపై లక్కీ డ్రా ఉంటుందన్నారు.