పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత పెరిగింది. ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో పాక్ దాడిలో 40 మంది తాలిబన్లు హతమయ్యారు. ఈ తాజా దాడులతో మృతుల సంఖ్య 240కి చేరింది. పరిస్థితి తీవ్రం కావడంతో, దాడులు ఆపాలని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను కోరింది. కాగా, ఇప్పటికే ఇరు దేశాలు కాల్పుల విరమణను ప్రకటించిన విషయం తెలిసిందే.