ప్రకాశం: కంభం మండలంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థులకు గురువారం భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు భూసార పరీక్షా కేంద్రం ఎవోడీ స్వరూప మట్టి నమూనా సేకరణ, పరీక్షా విధానం, మొబైల్ యాప్ వినియోగం, టెస్టింగ్ పరికరాల పనితీరును వివరించారు. అనంతరం మట్టి నమూనా సేకరణకు ప్రాక్టికల్ డెమో ఇచ్చారు.