ప్రకాశం: కనిగిరి పామూరు బస్టాండ్ నందు గురువారం గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఇందులో భాగంగా మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ.. ఆహారం వృథా చేయకుండా పేదరికం మరియు ఆకలి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. జంక్ ఫుడ్‌కు అలవాటు పడకుండా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు చేసుకోవాలన్నారు.