CTR: జిల్లా స్థాయి వాలీబాల్ జట్టుకు చౌడేపల్లి మండలంలోని శెట్టిపేట పంచాయతీ మేకలచిన్నపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని భావన ఎంపిక అయినట్లు HM చంద్రశేఖర్ తెలిపారు. పలమనేరులో జరిగిన డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో జిల్లా జట్టుకు ఎంపిక అయినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థిని పలువురు అభినందించారు.