KMM: ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల కార్మికుల వేతనాలు తగ్గిస్తే ఉద్యమం తప్పదని AISF జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ హెచ్చరించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 35 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.