PLD: మాచవరం మండలం వేమవరం వెళ్లే రహదారిలో మహారాష్ట్రకు చెందిన సిమెంట్ లోడు లారీ తంగేడు బ్రిడ్జి పై నుంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు గురువారం ఉదయం బయలుదేరింది. ఇదే సమయంలో వేమవరం మలుపులో రోడ్డు పక్కనే ఉన్న గుంతలో లారీ టైర్లు కూరుకుపోవడంతో ఎంత ప్రయత్నించినా లారీ బయటకు రాకపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది.