NLG: ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ మండలం రాములబండలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సీపీఎం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. నేటికీ ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించకపోవడం రైతాంగాన్ని తీవ్రంగా నిరాశపరుస్తోందన్నారు.