KRNL: బళ్లారి జిల్లా గుంపకి చెందిన 90 ఏళ్ల లక్ష్మమ్మను ఆమె కుమారుడు రమేశ్ బుధవారం ఆదోనిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. భర్త మరణానంతరం ఒంటరిగా ఉన్న లక్ష్మమ్మను భారంగా భావించిన రమేశ్, ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి ఎమ్మిగనూరు సర్కిల్ సమీపంలో వదిలేశాడు. 2 రోజులపాటు అన్నం, నీళ్లు లేకుండా అనాథగా రోడ్డుపై ఉన్న ఆమెకు మహిళా నాయకురాలు శ్రీలక్ష్మి అండగా నిలిచారు.