ADB: నేరడిగొండ మండలం బోరిగం గ్రామపంచాయతీ పరిధిలోని సేవదాస్ నగర్ గ్రామానికి వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురి కావడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా పరిస్థితి గమనించిన స్థానిక నాయకుడు రాథోడ్ వినేశ్ తన సొంత ఖర్చుతో జేసీబీ సహాయంతో రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఈ మేరకు సేవ దాస్ నగర్ గ్రామస్తులు వినేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.