KMR: బిక్కనూరు మండలం కాచాపూర్‌లో శిథిలావస్థలో ఉండి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించారు. గ్రామంలోని పాత గ్రామ సచివాలయం వద్ద ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం ఉండటంతో స్థానికులు విద్యుత్ శాఖ సంకీర్త్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఆయన స్పందించి జేసీబీ సహాయంతో గురువారం తొలగించారు. దీంతో కాలనీవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.