MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో బుధవారం రాత్రి మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. DCC అధ్యక్షుడు అశోక్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.