E.G: నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన జనసేన నాయకులు హనుమంతు వెంకన్న నియమితులయ్యారు. బుధవారం రాత్రి ప్రభుత్వ ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు. తన నియామకానికి సహకరించిన మంత్రి కందుల దుర్గేశ్కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వెంకన్న నియామకం పట్ల జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేసి, అభినందించారు.