NLG: చిట్యాల మండలం వెలిమినేడులో సర్పంచ్ పదవికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. 700 మంది ఓటర్లు ఉన్నప్పటికీ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎస్సీ అభ్యర్థి సర్పంచ్ అయ్యే అవకాశం రాలేదని గ్రామానికి చెందిన ముక్కిడి అంజయ్య పేర్కొన్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ స్థానాలు మారాలని అన్నారు.