JGL: జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బుధవారం ఆధునిక భారతదేశ పితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశ ప్రతిష్ఠను పెంచి, రక్షణ రంగాన్ని బలోపేతం చేసిన కలాం సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, ప్రధాన కార్యదర్శి తుమ్మనపెల్లి రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.