W.G: మెగా డీఎస్సీ ఉత్తీర్ణులైన నూతన ఉపాధ్యాయుల పరిచయ కార్యక్రమం బుధవారం నరసాపురంలోని హై స్కూల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోపి మూర్తి పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు హక్కుల కన్నా పిల్లల భవిష్యత్ పై బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అందరూ సమయ పాలన పాటించాలని సూచించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.