ADB: భోరజ్ మండలం బాలాపూర్ రోడ్డుపై చెత్త కుప్పలు డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్నాయి. పలువురు రోడ్లపై చెత్తను పడేయడంతో అది కాస్త కుప్పలు కుప్పలుగా మారి చెత్తకుప్పల మారిందన్నారు. పరిసర ప్రాంతా ప్రజలకు డెంగీ, టైఫాయిడ్ మలేరియా ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్త కుప్పలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.