SRPT: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ నెలకొంది. పార్టీ అధికారంలో ఉండడమే ఈ పోటా పోటీకి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ గట్టిగానే కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా ఏఐసీసీ పరిశీలకుడు జిల్లాలోనే గత రెండు రోజుల నుంచి ఉంటున్నారు. జిల్లా నుంచి ఆరుగురి పేర్లను అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది.