MDK: జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగులు వేతనాలు చెల్లించాలని ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. సెప్టెంబర్ నెల వేతనాలు ఇప్పటికీ విడుదల కాలేదని, ముఖ్యమైన దసరా, దీపావళి పండగలకు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వివరించారు. జిల్లా విద్యాధికారి స్పందించి వెంటనే వేతనాలు విడుదల చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు కోరారు.