KMM: ఖమ్మం కలెక్టరేట్లో ఇవాళ జిల్లా కలెక్టర్ అనుదీప్‌ను సమాచార హక్కు చట్టం కమీషనర్ పి.వి. శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిశారు. సమాచార హక్కు చట్టం అమలు, సమాచార హక్కు చట్టం నిబంధనలు 4(1)(బి), 6(1) లపై పౌర సమాచార అధికారులకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ, జిల్లాలో పెండింగ్ ఉన్న ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం మార్గం తదితర అంశాల పై కలెక్టర్‌తో చర్చించారు.