AP: ప్రతిఇంటికీ తాగునీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జల్జీవన్ మిషన్ పనులపై ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తొలిసారి గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం సిబ్బందికి శిక్షణా తరగతులు అందించనున్నామని చెప్పారు. నీటిశుద్ది, నాణ్యత, నీరు సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.