VSP: చీపురుపల్లి ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలునిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేటట్టు స్వామివారు అనుగ్రహించాలని కోరారు.