BDK: పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్లో రోడ్డుకు గుంతలు పడి ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఈ విషయం తెలుసుకున్న వర్తక సంఘం అధ్యక్షులు గుండు సురేష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు గోపాల్, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వెంకటేశ్వర్లు స్పందించి ఆ గుంతలో కాంక్రీట్ పోశారు. గతంలో ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగిందని అన్నారు.