మొన్న సుజాతక్క, నిన్న మల్లోజుల.. ఇలా అగ్రనేతల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే మరో అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు(ఆశన్న- ములుగు జిల్లా) ఈ రోజు ఛత్తీస్గఢ్ CM విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన తన 70 మంది సహచరులతోపాటు ఆయుధాలు వీడనున్నారు.