CTR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. 20 మండలాల్లో వర్షపాతం నమోదు అయినట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఐరాల 22.4మిమీ, చౌడేపల్లి 18.0మిమీ, వెదురుకుప్పం 10.2మిమీ, విజయపురం 9.2 మిమీ వర్షం కురవగా మిగిలిన మండలాల్లో తేలికపాటి వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.