AP: రాష్ట్రంలో రూ.13,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ప్రధాని మోదీ మరికాసేపట్లో కర్నూల్ చేరుకోనున్నారు. ఈ ఏడాది ఆయన రాష్ట్రంలో పర్యటించడం ఇది మూడో సారి. జనవరి 9న విశాఖలో పర్యటించి దాదాపు రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం/శంకుస్థాపన చేసిన ఆయన.. మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టారు.