SKLM: పాతపట్నం ప్రధాన హైవే రహదారి ప్రక్కనే బజార్ ఉండడం ప్రయాణ రాకపోకులకు, పాదాచారులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అనేకమార్లు పాలకులు ప్రకటిస్తున్న నేటికీ రైతు బజార్ ఏర్పాటు చేయకపోవడం అనేక విమర్శలకు దారితీస్తుంది. నియోజకవర్గ కేంద్రంలో రైతు బజార్ లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.