VSP: విద్యుత్ రంగంలో కొత్త ఆవిష్కరణల కోసం హ్యాకథాన్ నిర్వహించనున్నామని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ తెలిపారు. వినూత్న సాంకేతిక పరిష్కారాలను అందించగల స్టార్టప్‌లు ఇందులో పాల్గొనవచ్చన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లకు స్మార్ట్, డేటా ఆధారిత ఆధునిక సాంకేతిక పరిష్కారాలను కనుగొనడం ఈ హ్యాకథాన్ లక్ష్యమని వివరించారు.