GNTR: మంగళగిరి రూరల్ సీఆర్డీఏ పరిధిలోని కురగల్లులో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన రూ. 2 లక్షల విలువైన డైనేజీ సామాన్లు, ఐరన్‌ను చోరీ చేసిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకట్ బుధవారం తెలిపారు. విజయవాడ ఇబ్రహీంపట్నంకు చెందిన జగదీష్, గణేశ్, దుర్గారావు, మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించారన్నారు.