KNR: చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన దీకొండ స్వాద్విన్ కుమార్ తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలుడి తల్లి మూడేళ్ల క్రితం ఊపిరితిత్తుల వ్యాధితో మరణించగా తండ్రి ఆదివారం గుండెపోటుతో దూరమయ్యాడు. ఈ క్రమంలో బాలుడి దయనీయ స్థితిని చూసిన రాగంపేట గ్రామస్థులు కంటతడి పెడుతూ ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.