మన్యం: మద్యం తనిఖీ కోసం మొబైల్ యాప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎక్సైజ్ సీఐ పీ.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన మద్యమా కాదా తెలుసుకోవడానికి సీసా మూత వద్ద క్యూఆర్ కోడ్ ఉంటుందని, అది స్కాన్ చేస్తే వివరాలు వస్తాయన్నారు. నాణ్యమైన మద్యం కాకపోతే తమను సంప్రదించాలని సూచించారు. కల్తీ మద్యం అమ్మేవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.