NLG: జిల్లా కనగల్ మండలంలో రైతుల తోటల నుంచి శ్రీగంధం చెట్లు నరికిన అంతర్ రాష్ట్ర గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆరుగురిలో ముగ్గురిని అరెస్ట్ చేయగా, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి 11 శ్రీగంధం మొద్దులు, 2 బైకులు, 3 రంపాలు, గొడ్డల్లు, కట్టర్లు, మొబైళ్ళు స్వాధీనం చేసుకున్నారు.